. తలస్నానం చేసే ముందు జుట్టులో చిక్కులేమీ ఉండకూడదు, చిక్కులు ఎలా పడితే అలా తియ్యకూడదు. చివర్ల దగ్గర ప్రారంభించి పైపైకి దువ్వాలి. హెయిర్ బ్రష్, దువ్వెనల ఎంపికలోనూ మెలకువలు పాటించండి. వెడల్పు ఫళ్ళున్న బ్రష్ ఐతే మంచిది.
షాంపూ చేసుకుంటున్నపుడు శిరోజాలను అలా పొడవుగా వదిలేస్తే నీళ్లు, షాంపూ వాటి మీదగా సులువుగా జారిపోతాయి. వీలైనంత ఎక్కువ నీటితో వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి. షాంపూ ఛాయలే మిగలకూడదు. ఇప్పుడు తలస్నానం చేసినా కండిషన్ చేయటం మరవకండి.
ఆరబెట్టుకోండిలా ... తలస్నానం చేశాక జుట్టును ఆరబెట్టుకోవడంలో చాలా శ్రద్ద చూపాలి. పొడి టవల్ తో తుడవాలి. లేదంటే టవల్ను తలకు చుట్టి ముడిలా పెట్టుకోవచ్చు. జుట్టు తడారిన దువ్వుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: